డెబ్యూ రికార్డ్: హృతిక్ రోషన్‌‌, రామ్ చరణ్‌లకు షాకిచ్చిన వైష్ణవ్‌

'ఉప్పెన'తో మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ రికార్డులను తిరగరాస్తున్నాడు. ముఖ్యంగా ఒక డెబ్యూ హీరో చిత్ర కలెక్షన్లు.. ఓ స్టార్‌ హీరో చిత్ర రేంజ్‌లో ఉండటం విశేషం. కొందరు సీనియర్‌ హీరోలు కూడా ఇప్పటి వరకు సాధించని రికార్డ్‌ను వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన'తో అందుకున్నాడు. ఒక్క టాలీవుడ్డే కాదు.. ఒక డెబ్యూ హీరోల పేరిట బాలీవుడ్‌లో ఉన్న రికార్డ్‌ను కూడా వైష్ణవ్‌ బీట్‌ చేశాడు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ పేరిట ఉన్న డెబ్యూ రికార్డ్‌ను కూడా బీట్‌ చేసి చరిత్ర సృష్టించాడు వైష్ణవ్‌. హృతిక్‌ రోషన్‌ హీరోగా పరిచయమైన చిత్రం 'కహో నా ప్యార్ హై'. ఈ చిత్రం అప్పట్లో 5 డేస్‌లో 42 కోట్ల నెట్‌ వసూల్‌ సాధించినట్లుగా లెక్కలు చెబుతుంటే.. ఇప్పుడు వైష్ణవ్‌ తేజ్‌ 5 రోజుల్లో 43 కోట్ల నెట్‌ వసూల్‌ సాధించి.. చరిత్ర లిఖించాడు. దాదాపు 21 సంవత్సరాల క్రితం నమోదైన ఈ రికార్డును ఇంత వరకు ఏ డెబ్యూ హీరో టచ్‌ చేయలేదు. ఇప్పుడు వైష్ణవ్‌ ఆ రికార్డ్‌పై తన పేరును రాశాడు.

ఇక టాలీవుడ్‌లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ 'చిరుత' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి కుమారుడిగా ఎంటరైన రామ్‌ చరణ్‌ తొలి చిత్రంతో డెబ్యూ హీరోగా రికార్డ్‌ని క్రియేట్‌ చేశాడు. 14 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ని వైష్ణవ్‌ కేవలం మూడంటే మూడు రోజుల్లోనే బీట్‌ చేశాడు. ఇంకా ముందు మందు మరిన్ని రికార్డులు ఈ చిత్రంతో వైష్ణవ్‌ అందుకుంటాడని ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి. మరి ఇదే ప్రభంజనం వైష్ణవ్‌ తన రెండో చిత్రంతో కూడా సృష్టిస్తే.. బాక్సాఫీస్‌ వద్ద వైష్ణవ్‌కి ఓ బిగ్‌ మార్కెట్‌ ఏర్పడటం ఖాయం. వైష్ణవ్‌ తన రెండో చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా త్వరలోనే విడుదలకానుంది.

Other news