ఆత్మహత్య చేసుకున్న మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్

కన్నడ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య ఈరోజు తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. మీడియా కథనం ప్రకారం ఆమె తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ వార్త కన్నడ ఇండస్ట్రీలో అందరినీ షాక్ కు గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కన్నడ ఇండస్ట్రీ ప్రార్ధిస్తోంది.
 
గత ఏడాది కాలం నుండి జయశ్రీ డిప్రెషన్ తో పోరాడుతున్నట్లు సమాచారం. గతేడాది జులై 22న “నేను నిష్క్రమిస్తున్నాను. ఈ ప్రపంచానికి, డిప్రెషన్ కు గుడ్ బై” అని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే కొద్దిసేపటికే ఆ పోస్ట్ ను డిలీట్ చేసి తాను బాగానే ఉన్నట్లు పోస్ట్ చేసింది.

మళ్ళీ జులై 25న తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. “నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చెయ్యట్లేదు. నాకు ఆర్ధికంగా సహాయం అవసరం లేదు. నేను ఆర్ధికంగా బాగానే ఉన్నాను. కానీ నాకు చావు మాత్రమే కావాలి. నాకు చాలా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. నేను చిన్నప్పటి నుండి మోసపోతూనే వచ్చాను. డిప్రెషన్ నుండి బయటకు రాలేకపోతున్నా” అని మాట్లాడింది జయశ్రీ.

Other news