Krack Movie Box Office Collections: ‘క్రాక్’ బాక్సాఫీస్ కలెక్షన్స్

‘క్రాక్’ – టైటిల్ తోనే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొని, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన క్రాక్ సినిమా థియేటర్స్ లో కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ సినిమా మరీ రొటీన్ ఫార్ములాలా ఉన్నా మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉండడం, థియేటర్స్ లో చాలా రోజుల నుంచి సినిమాలేని ఎఫెక్ట్ వలన థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అదీకాక క్రాక్ తర్వాత వచ్చిన 3 సినిమాలు కూడా దీనికన్నా బాగుండకపోవడం క్రాక్ కి మరింత హెల్ప్ అయ్యింది. దీంతో రవితేజ క్రాక్ మొదటి రోజు నుంచీ 6వ రోజు వరకూ ఆగకుండా సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మొత్తంగా 16.5 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేస్తే ఈ సినిమా లాభాల బాట పట్టినట్టు, మొదటి ఐదు రోజుల్లో 17 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసి, అన్ని ఏరియాల్లో లాభాల బాట పట్టింది. ఆరవ రోజు కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా 2 కోట్ల షేర్ సాధించి మాస్ మహారాజ్ హవాని చాటుకుంది. ‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘క్రాక్’ హిట్ అవ్వడంతో హ్యాట్రిక్ కాంబినేషన్ అనిపించుకున్నారు.


 ప్రీమియర్స్ + మొదటి రోజు మొత్తం షేర్:  6.27 కోట్లు

రెండవ రోజు మొత్తం షేర్: 3.08 కోట్లు

మూడవ రోజు మొత్తం షేర్: 2.85 కోట్లు

నాల్గవ రోజు మొత్తం షేర్: 2.65 కోట్లు

ఐదవ రోజు మొత్తం షేర్: 2.16 కోట్లు

ఆరవ రోజు ఏరియా వారీగా కలెక్షన్స్ రిపోర్ట్:  

నైజాం – 65 లక్షలు

సీడెడ్ – 43 లక్షలు

ఉత్తరాంద్ర – 25 లక్షలు

తూర్పు గోదావరి – 21 లక్షలు

పశ్చిమ గోదావరి – 17  లక్షలు

గుంటూరు – 18 లక్షలు

కృష్ణ – 17 లక్షలు

నెల్లూరు – 15 లక్షలు

మొత్తం – 2.21 కోట్లు

ఆరు రోజుల మొత్తం షేర్: 19.22 కోట్లు

Other news