రామమందిర నిర్మాణానికి ప్రణీత రూ. లక్ష విరాళం

అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి  "రామ మందిర్ నిధి" పేరుతో విరాళాలు సేకరిస్తోంది. ఇప్పుటికే ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా రామ మందిర్ నిర్మాణానికి విరాళాలు అందించారు. తాజాగా సినీ రంగం నుంచి తొలి విరాళంగా బాపు బొమ్మ ప్రణీత సుభాష్ లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. అందరూ ముందుకొచ్చి రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు అందించాలని కోరుతూ ఓ వీడియోను ప్రణీత ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల కరోనా ప్యాండమిక్‌లో కూడా ప్రణీత తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తన గొప్ప మనసును చాటుకున్న విషయం తెలిసిందే.

Other news