పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమా మళ్లీ మొదలైంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నూతన సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నా, చిత్రీకరణలో ఉన్న సినిమాలపై అప్‌డేట్ రావట్లేదని కూడా వారు అంటున్నారు. అయితే ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ వారు పవన్ నూతన సినిమాపై లెటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. నేడు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించారట. దీనికి సంబంధించి ఓ ట్వీట్‌ను చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారు క్రిష్ గారి సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంతగా ఉంద’ని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రీకరణకు చెందిన కోన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే ఇటీవల దర్శకుడు క్రిష్ కరోనా బారిన పడ్డాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ నిలిచింది. ఇంతలో పవన్ తన తదుపిర చిత్రాన్ని మొదలు చేయనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే క్రిష్ కరోనా నుంచి కోలుకోవడంతో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాలో పవన్ కొత్త లుక్ ట్రై చేయనున్నాడట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.

Other news