వర్కర్లకు కోటి రూపాయలు బాకీపడ్డ రాంగోపాల్ వర్మ

వివాదాస్పద కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. తన సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులకు, వర్కర్లకు వర్మ జీతాలు చెల్లించలేదని, కోటి రూపాయల వరకూ బాకీ పడ్డాడని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్(ఎఫ్‌డబ్ల్యూ‌ఐసీఈ) చెప్పుకొచ్చింది. వర్మ సినిమాలకు ఇకపై తమ 32 యూనియన్లలోని ఏ ఒక్కరూ పనిచేయరని ఎఫ్‌డబ్ల్యూ‌ఐసీఈ తేల్చి చెప్పింది. తన సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు, వర్కర్లకు జీతాలు చెల్లించకుండా కోటి రూపాయలకు ఎగ్గొట్టిన వ్యవహారంలో వర్మకు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ స్పష్టం చేశారు. ఈ నోటీసులపై స్పందించకపోవడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించేందుకు కూడా వర్మ సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది.

Other news