మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా కోసం 4కోట్లు ఖర్చు పెట్టనున్న నిర్మాతలు..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” సినిమా కోసం రూ. 4 కోట్లు ఖర్చు పెట్టి ఓ భారీ సెట్ నిర్మించడానికి కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సందేశాత్మక సినిమా కథ దేవాదాయ భూముల ఆక్రమణ చుట్టూ తిరుగుతుందట. అందుకే ఒక దేవాలయం తో పాటు దేవాదాయ శాఖ కార్యాలయానికి సంబంధించిన భారీ సెట్ నిర్మించబోతున్నారట.

దేవాలయము మరియు దేవాదాయ శాఖ కార్యాలయంలో చోటుచేసుకునే సన్నివేశాలు కేవలం 30 నిమిషాల పాటు మాత్రమే ఉంటాయట. ఐతే ఈ 30 నిమిషాల సినిమా కోసం ఏకంగా నాలుగు కోట్లు ఖర్చుపెట్టడానికి చిత్ర యూనిట్ సిద్ధం కావడం విశేషం.

ఆచార్య మూవీలో చిరంజీవి ఎండోమెంట్ ఆఫీసర్‌ పాత్రతో పాటు నక్సలైట్‌ పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అరవిందస్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా.. రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషించనున్నారు.

Other news