(Alekhya Harika) దేత్తడి హారికకు పెళ్లైపోయిందా? అభిజిత్-హారిక పెళ్ళి చేసుకోబోతున్నారా?

బిగ్ బాస్ హౌస్‌లో అభిజిత్‌తో బాగా క్లోజ్‌గా ఉంటూ రూమర్లకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హారిక.. ఇటీవల తన బ్రేకప్ లవ్ స్టోరీని రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఒక డార్క్ సీక్రెట్ చెప్పాలని బిగ్ బాస్ కోరినప్పుడు.. తాను ఒక వ్యక్తితో నాలుగున్నరేళ్లు రిలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది.

అమ్మనాన్నల మధ్య గొడవల సమయంలో ఒక వ్యక్తి తనకు బాగా క్లోజ్ అయ్యాడని అది ఇష్టంగా మారడంతో ప్రేమించుకున్నాం అని.. అయితే నాలుగున్నరేళ్లు రిలేషన్‌లో ఉండగా.. రెండేళ్ల క్రితం ఇద్దరికీ బ్రేకప్ అయ్యి విడిపోయినట్టు చెప్పింది హారిక. అయితే ఈ విషయం తన తల్లికి తెలియదని.. ఈ బిగ్ బాస్ హౌస్‌ నుంచి సీక్రెట్ రివీల్ చేస్తున్నట్టు చెప్పింది హారిక. అయితే బ్రేకప్ తరువాత చాలా నార్మల్‌గా ఉన్నాని తను ఇప్పుడు సూపర్ గుడ్ అంటూ చెప్పుకొచ్చింది హారిక.

అయితే బిగ్ బాస్ హౌస్‌లో అభిజిత్-హారికల మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి. వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి ఒకే చోట 70 రోజులుగా ఉంటే.. రిలేషన్ ఉండదని అనుకోలేం. వాళ్లది ఫ్రెండ్ షిప్ అనే అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే బయటకు వచ్చిన తరువాత వాళ్లే చెప్తారు. ఇద్దరూ ఇష్టపడితే పెళ్లి చేయడానికి మాకేం ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చారు హారిక తల్లి జ్యోతి.

Other news