"ఎఫ్‌2" కు సీక్వెల్‌ గ "ఎఫ్‌ 3"

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2న సీక్వెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 3 పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఎఫ్‌ 2లో నటించిన వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహ్రీన్‌.. ఈ సీక్వెల్‌లోనూ నటించనున్నారు. వారితో పాటు మరికొందరు ఇందులో భాగం కాబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించేందుకు డేట్‌ ఫిక్స్ అయ్యిందట. డిసెంబర్ 14న ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్‌. దీనికి సంబంధించిన వెంకటేష్‌, వరుణ్‌లు డేట్లు ఇచ్చేసినట్లు కూడా సమాచారం. ఇక దిల్‌ రాజు నిర్మించనున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. 

Other news