బిగ్ బాస్ 4: ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. ఉన్నట్లా.? లేనట్లా.?

బిగ్ బాస్ 4 ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. మొదట్లో ఈ షో అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో తడబడినా.. చివరికి వచ్చేసరికి నెమ్మదిగా పుంజుకుంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం ఇంకా కొంచెం కన్ఫ్యూజన్‌లో ఉన్నారని చెప్పాలి. కెప్టెన్సీ కోసం ఫ్రెండ్స్‌తో కొట్టిన అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లిపోతే.. మోనాల్ ఇప్పుడిప్పుడే కరెక్ట్ రూట్‌లోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇక లాస్య జున్నూను గుర్తు చేసుకుంటూ.. అరియనా ఒంటరిని అయ్యానంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇలా హౌస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో వరుస.

ఇదిలా ఉంటే పదోవారానికి గానూ అభిజిత్, సోహైల్, మెహబూబ్, అరియానా, హారిక ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. వీరిలో మెహబూబ్, మోనాల్ గజ్జర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీపావళి సందర్భంగా ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేస్తారని ఓ టాక్ నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మరోసారి మెహబూబ్ అదృష్టవంతుడని చెప్పవచ్చు. అలాగే సీక్రెట్ రూమ్‌ నుంచి అఖిల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడట. మరి ఈ వీకెండ్ అఖిల్ రీ-ఎంట్రీతో పాటు ఎలిమినేషన్ ఉంటుందో.? లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Other news