బిగ్‌బాస్ నుంచి మెహ‌బూబ్ అవుట్‌!

ప‌దోవారం ముగింపులోకి వ‌చ్చిన బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్ప‌టికే ప‌ది మంది కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. సూర్య‌కిర‌ణ్‌, క‌ల్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, సుజాత‌, కుమార్ సాయి, దివి, అమ్మ రాజ‌శేఖ‌ర్ ఎలిమినేట్ అయ్యారు. అనారోగ్య కార‌ణాల‌తో గంగ‌వ్వ‌, నోయ‌ల్ స్వ‌తంత్రంగా హౌస్‌ను వీడి వ‌చ్చేశారు. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ప‌క్క‌న పెట్టి అస‌లు ఎలిమినేష‌న్ ఉంటుందా?  లేదా? అని అంద‌రూ అయోమ‌యంలో ప‌డిపోయారు.
కానీ తాజాగా లీకువీరులు చెప్తున్న స‌మాచారం ప్ర‌కారం ఎలిమినేష‌న్ ఎత్తేయ‌లేదు. దీపావ‌ళి పండ‌గ‌ను సాకుగా చెప్తూ అంద‌రినీ సేఫ్ చేయ‌లేదు. ముందు నుంచి ఊహిస్తున్నదాని ప్ర‌కారం మెహ‌బూబే ఈ వారం ఎలిమినేట్ అయ్యాడ‌ని వినికిడి. నిజానికి ఎప్పుడో బ్యాగు స‌ర్దేయాల్సింది. కానీ అదృష్టం బాగుండి త‌ప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్ట‌కేల‌కు నామినేష‌న్‌లోకి వ‌చ్చి అడ్డంగా బుక్క‌య్యాడు. నామినేష‌న్‌లో ఉన్న‌వాళ్ల‌లో అరియానా మీద వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ మెహ‌బూబ్ మీద అంత‌క‌న్నా ఎక్కువే ఉండ‌టంతో అత‌డికి పెద్ద‌గా ఓట్లు కుర‌వలేదు.

Other news