రాజశేఖర్‌ కుటుంబం మొత్తంకు కరోనా పాజిటివ్‌

యాంగ్రీయంగ్‌మన్‌ రాజశేఖర్‌ కుటుంబం మొత్తం కూడా కరోనా బారిన పడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్‌ తెలియజేశారు. కరోనా బారిన పడ్డట్లుగా ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. నేను జీవిత మరియు పిల్లలు అందరం కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. పిల్లలు ఇద్దరు కూడా పూర్తిగా సేఫ్‌ అయ్యారు. కాని నేను జీవిత మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాం. కాస్త పర్వాలేదు అనిపిస్తుంది. త్వరలోనే మేము కూడా ఇంటికి చేరుకుంటాం అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. రాజశేఖర్‌ కరోనా పాజిటివ్‌ అంటూ తెలియడంతో వెంటనే సినీ ప్రముఖులు మీడియా వారు మరియు అభిమానులు అంతా కూడా ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్‌ దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆయన కూతుర్లు ఇంటికి వచ్చేశారు. వారికి పని వారి నుండి కరోనా సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా రాజశేఖర్‌ దంపతులు వెంటనే కరోనా నుండి కోలుకోవాలని ఆశిద్దాం.

Other news