బిగ్ బాస్-4 హౌస్ నుంచి ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

ఐదోవారం ఎలిమినేషన్‌లో భాగంగా 9 మంది నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? బిగ్ బాస్ సీజన్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ మంచి రసపట్టులో జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటూ.. గొడవలు తిట్టుకోవడాలు, దూషణల పర్వంతో ఏకంగా తొమ్మిది మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. అఖిల్, అభిజిత్, నోయల్, సొహైల్, రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు?? ఎవరు సేఫ్.. ఎవరికి డేంజర్ అనే విషయానికి వస్తే.. జోర్దార్ సుజాత ఖచ్చితంగా ఎలిమినేట్ కావడం ఖాయమే అంటూ ఆమెకు సగానికి సగం మంది ఓట్లు వేస్తున్నారు. సుజాత ఎలిమినేట్ అవుతుందని 44 శాతం మంది ఓట్లు వేశారు. ఇక మోనాల్ విషయానికి వస్తే.. ఎఫైర్ ఇష్యూతో ఆమెను బిగ్ బాస్ హైలైట్ చేస్తున్నారు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఇంగ్లీష్ పాపతో ట్రైయాంగిల్ ట్రాక్ నడిపిస్తున్నారు. ఆమెతో రేటింగ్ బాగా దండుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో మోనాల్‌ను ఎలిమినేట్ చేయడం జరగని పని. అంటే ఈరోజుతో బిగ్ బాస్ లో సుజాత చాప్టర్ క్లోజ్ అన్నమాట..

Other news