ఫ్యాన్స్ ఆశల మీద నీళ్ళు చల్లి,పెళ్ళి చేసుకోబోతున్న కాజల్ అగర్వాల్..పెళ్లికొడుకు ఎవరో తెలుసా?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లు అనే ఇంటీరియర్ డిజైనర్ ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ చదువుకునే సమయం నుంచీ స్నేహితులనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని.. పెద్దలు అంగీకారంతోనే వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది. వివాహ నిశ్చితార్ధం కూడా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై కాజల్.. ఆమె కుటుంబసభ్యులు ఎవరూ ఇంకా స్పందించలేదు.

Other news