Loading. Please wait.

actress,actors gallery

అల్లరి నరేష్ ది 57వ సినిమా. ‘నాంది’ ఓటీటీ లో రిలీజ్..!

అల్లరి నరేష్ విలక్షణ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. అల్లరోడికి ఇది 57వ సినిమా. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి..

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను జీ5 ఓటీటీ సంస్థ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ త్వరలోనే పూర్తి చేసి ఈ సినిమాను జీ5లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. కాగా, ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, ప్రియదర్శి, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు అల్లరి నరేష్ ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.

Other news