Loading. Please wait.

actress,actors gallery

సినిమాలో నటించాలంటే ఆ డైరక్టర్ నన్ను బట్టలు విప్పమన్నారు

హిందీ సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్ పై ప్రముఖ మోడల్ పాలా చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. హే బేబీ, హౌస్ ఫుల్, హౌస్ ఫుల్2.. వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు సాజిద్. దేశంలో మీటూ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆయనపై ముగ్గరు ఆరోపణలు చేశారు. దీంతో హౌస్ ఫుల్4 ప్రాజెక్టు నుంచి సాజిద్ ను తప్పించారు మేకర్స్. మళ్లీ ఇప్పుడు మోడల్ పాలా చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

‘నేను సినిమాల్లో నటించేందుకు వచ్చినప్పుడు నా వయసు 17 ఏళ్లు. అప్పుడు సాజిద్ ఖాన్ నన్ను ఆడిషన్ కు పిలిచారు. తాను దర్శకత్వం వహిస్తున్న హౌస్ ఫుల్ సినిమాలో నటించాలంటే ఆయన ముందు బట్టలు విప్పాలని అన్నారు. ఆ సమయంలో చాలా తనతో చాలా అసహ్యంగా ప్రవర్తించాడు. అప్పట్లోనే ఈ విషయం నేను చెప్పలేకపోయాను. నా మీద ఆధారపడిన వాళ్లకు నేను సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు నేను స్వతంత్రంగా ఉన్నాను. అందుకే ఇప్పుడు ఈ విషయాలు చెప్తున్నాను. సాజిద్ ఇలానే చాలామందిని వేధించాడని అనుకుంటున్నాను.

క్యాస్టింగ్ కౌచ్ లో భాగంగా ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. సాజిద్ లాంటి వ్యక్తులకు శిక్ష పడాల్సిందే. ఎంతో మంది పైకి రావాల్సిన వారి జీవితాలు నాశనం చేసి ఉంటాడు. సాజిద్ వేధింపుల తర్వాత నేను మానసికంగా బలంగా తయారయ్యాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులకు అవకాశం ఉండకూడదు. ఇప్పటివరకూ ఈ విషయాల్సి నేను చెప్పకపోవడం తప్పే. గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన నేను సాజిద్ వేధింపులను చెప్పలేకపోయాను. ప్రస్తుతం నా మీద ఎవరూ ఆధారపడి లేరు. అందుకే ఈ విషయాలు ఇప్పుడు చెప్తున్నాను’ ని చెప్పుకొచ్చింది పాలా.

Other news