గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు మృతి..

సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. మహేష్ కోనేరు మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో తెలుగులో పలు చిత్రాలను నిర్మించారు మహేష్. హీరో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‍కు మహేష్ కోనేరు వ్యక్తిగత పీఆర్‏గా పనిచేశారు. 118, తిమ్మరుసు, మిస్ ఇండియా సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై వరుసగా ఆసక్తికర ట్విట్స్ చేశారు.

మహేష్ మృతి పట్ల ఎన్టీఆర్ స్పందించారు. మహేష్ కోనేరు మృతి వార్త తెలిసి షాక్ కు గురయ్యానని తెలిపారు. ఈ మేరకు తన ట్వి్ట్టర్ ఖాతాలో భావోద్వేగ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు..మహేష్ కుటుంసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని పేర్కొన్నారు..

Other news