Mumbai Drug Bust: నడిసంద్రంలో రేవ్ పార్టీ.. కోట్లాది రూపాయల ఖర్చు.. పట్టుబడ్డ వారిలో షారూఖ్ ఖాన్ తనయుడు!

10/3/2021
లగ్జరీ షిప్‌లో హై ప్రొఫైల్‌ రేవ్‌ పార్టీ. కోట్లాది రూపాయల ఖర్చు..భారీగా డ్రగ్స్, ముద్దుగుమ్మలు, డీజే సౌండ్స్‌..ఇంకేముంది..నిషానిషాగా మస్త్‌ మజా చేసుకుంటున్నారు. పార్టీ పీక్స్‌కు చేరింది. కానీ ఇంతలోనే NCB అధికారులు ఎంట్రీ ఇచ్చేశారు. మాంచి మత్తులో ఉన్న పార్టీని భగ్నం చేసేశారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కొడుకుతో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో పలువురు యువతులు కూడా ఉన్నారు. భారీగా డ్రగ్స్‌తో పాటు లక్షల రూపాయలు నగదును సీజ్‌ చేశారు. NTPC యాక్ట్‌ కింద వారిని అరెస్ట్‌ చేసిన అధికారులు..ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.

అత్యంత విలాసవంతమైన కార్డీలియా క్రూయిజ్‌ లైనర్‌ అది. ముంబై నుంచి గోవాకు రెండు వారాల కిందటే ఈ క్రూయిజ్‌ లైనర్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. పార్టీ కోసం ఏకంగా ఆ క్రూయిజ్‌నే అద్దెకు తీసుకున్నారు. అంతా బడా బాబుల పుత్రరత్నాలే. ఈ పార్టీకి దాదాపు 1500మంది వరకు హాజరైనట్టు సమాచారం. కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి భారీగా డ్రగ్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు.

More news

Related News