Megastar Chiranjeevi Family meets Haryana Hurricane Kapil Dev :చిరకాల మిత్రుడిని కలుసుకున్న చిరంజీవి.. ప్రత్యేకమైన రోజంటూ ట్వీట్..

8/29/2021
మెగాస్టార్  చిరంజీవి తన చిరకాల మిత్రుడు భారతదేశానికి తొలి ప్రపంచకప్‏ను అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‏ను కలిశారు. ఎన్నో సంవత్సరాలుగా భారత్ క్రికెట్ జట్టు కంటున్న కళలను కపిల్ దేవ్ 1983లో నిజం చేశారు. ఫలుక్ నామా ప్యాలెస్‏లో జరిగిన ఓ సమావేశంలో కపిల్ దేవ్‏ను చిరు కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిరు సతీమణి సురేఖ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరు తన ఇన్‏స్టాలో షేర్ చేశారు. నా పాత మిత్రుడు కపిల్ దేవ్‏ను చాలా కాలం తర్వాత ఫలుక్‌నామా ప్యాలెస్‌లో కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఒక్కసారిగా గతంలోకి వెళ్లి ఆ రోజులను గుర్తుచేసుకున్నాను. ఆయన మనకు మొదటి ప్రపంచకప్ అందించిన హర్యానా హరికేన్  అంటూ ట్వీట్ చేశారు చిరు.

More news

Related News