E‍NG vs NZ Highlights, T20 World Cup 2021: న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ.. పోరాడి గెలిచినా కివీస్..

11/10/2021
England vs New Zealand Live Score in Telugu:టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సెమీ-ఫైనల్స్ తొలి పోరులో అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో తలపడనుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఇంగ్లండ్ జట్టు, టైటిల్ కోసం బలమైన పోటీదారుగా ఉంది. అయితే గాయపడిన ఆటగాళ్ల సమస్యతో ఇబ్బందిపడుతోంది. కొద్దిమంది ప్రముఖ ఆటగాళ్ల సహాయంతో న్యూజిలాండ్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. టోర్నమెంట్‌కు ముందే ఇంగ్లండ్‌ను టైటిల్ పోటీదారులుగా పరిగణించారు.

More news

Related News