సమంత- నాగ చైతన్య విడాకులు ఫిక్స్?

9/23/2021
సమంత-నాగ చైతన్య.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్. అయితే.., గత కొంత కాలంగా వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా అంతా ఈ వార్తలే. కానీ.. ఇటు నాగ చైతన్య గాని, సమంత గాని ఈ వార్తలపై పూర్తిగా ఓపెన్ అయ్యింది లేదు. సమంత రోజుకో రకమైన ట్వీట్ తో హింట్స్ ఇస్తున్నా, చైతూ వైపు నుండి ఆ మాత్రం ఇండికేషన్స్ కూడా లేవు. అసలు.. అక్కినేని కుటుంబంలో ఏమి జరుగుతోంది? చై-సామ్ నిజంగానే విడిపోబోతున్నారా? ఈ ప్రశ్నలు అన్నిటికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

సిగ్నెల్స్ ఇస్తూ వచ్చిన సమంత:

2017 అక్టోబర్ 10వ తేదీన నాగచైతన్య, సమంత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ నాలుగేళ్ల సంసార జీవితంలో వీరి మధ్య పెద్దగా గొడవలు వచ్చింది కూడా లేదు. పైగా.., చై జీవితంలోకి సామ్ వచ్చాక అతనికి సక్సెస్ లు కూడా వచ్చాయి. ఇలా అంతా సవ్యంగా జరిగిపోతూ వచ్చింది. కానీ.., సరిగ్గా నెల రోజుల క్రితం సామ్, చై విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

మొదట్లో అంతా దీన్ని ఓ గాసిప్ గా మాత్రమే చూశారు. కానీ.., సామ్ తన ట్విట్టర్ అకౌంట్ నుండి అక్కినేని ఇంటి పేరుని తొలగించింది. అప్పటి నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ విడాకుల వార్తపై ఫోకస్ పెట్టింది. తరువాత.. ఈ వార్తలకి బలం చేకూర్చేలా సామ్ తన ట్విట్టర్ అకౌంట్ కి “s” అక్షరాన్ని మాత్రమే పేరుగా ఉంచుకుంది. దీంతో.. అక్కినేని కపుల్స్ విడిపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఈ జంట విడాకుల వార్తలను ఖండించలేదు. పోనీ.., ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని మీడియానే సామ్ ముందు ఈ ప్రశ్న ఉంచింది. అప్పుడు కూడా ఈ అమ్మడు “బుద్ధి ఉందా” అంటూ మీడియా మీద కోపపడిందే గాని, అసలు మ్యాటర్ పై పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు.

నాగ చైతన్య మౌనం:

మరోవైపు నాగచైతన్య “లవ్ స్టోరీ” మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. కానీ.., ఆ ప్రమోషన్స్ లో ఎక్కడా సమంత కనిపించడం లేదు. చైతూ కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంటూ వస్తున్నాడు. ఒక్కోసారి దర్శక, నిర్మాతలకి కూడా అందుబాటులో ఉండకుండా వస్తున్నాడట. మీడియా ముందుకి కూడా తన వ్యక్తిగత ప్రశ్నలు అడగకూడదు అన్న కండీషన్ మీదే వస్తున్నాడట. దీంతో.. భార్యభర్తల మధ్య గ్యాప్ రావడం నిజమే అని ఇండస్ట్రీ వర్గాలు, మీడియూ వర్గాలు, సాధారణ ప్రేక్షకులు అంతా ఫిక్స్ అయిపోయారు. మరి ఇంత కాలం బాగుంటు వచ్చిన జంట.. ఇప్పుడు ఎందుకు విడిపోతున్నట్టు? గొడవ ఎక్కడ మొదలైంది?

గొడవలకి కారణం రాజీ పాత్రనా?

సమంతాకి సినిమాలంటే పిచ్చి. చెన్నై లో ఎక్కడో సాధరణ కుటుంబంలో జన్మించిన సామ్ కి ఇంత గుర్తింపు సాధించి పెట్టింది సినిమాలే. పెళ్లి తరువాత కూడా ఆ సినిమాలను వదులుకోవడానికి సమంత ఇష్టపడలేదు. పైగా.., స్కిన్ షో చేస్తూ.. ఫోటో షూట్స్, గ్లామరస్ రోల్స్, చేస్తూ వచ్చింది. కానీ.., అక్కినేని కోడలు ఇలా స్క్రీన్ పై అందాలు ఆరబోయడం చైతూకి, నాగార్జునకి ఏ మాత్రం నచ్చకుండా వచ్చింది. ఈ విషయంలో తన మనసు మార్చుకోవాల్సిందిగా, అమలని ఫాలో కావాల్సిందిగా కుటుంబ సభ్యులు సామ్ తో చాలాసార్లు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కానీ.., ఇవేవి కూడా మంచి ఫలితాలను ఇవ్వలేదు. సరిగ్గా.. ఇదే సమయంలో సమంతా “ఫ్యామిలీ మేన్-2” లో నటించింది. ఇందులో రాజీ పాత్ర చాలా బోల్డ్. అలాంటి పాత్రలో సమంత రెచ్చిపోయి నటించింది. ఇది అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ని చాలా డిస్టర్బ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో.. సినిమాల పట్ల సమంత ఆలోచనా విధానం మారకపోవడంతో మ్యాటర్ విడాకుల వరకు వచ్చిందట.

భరణంగా 250 నుండి 300 కోట్ల రూపాయలు:

సమంత-నాగ చైతన్య విడిపోవాలని నిర్ణయించుకున్న తరువాత వీరిద్దరికి ఫ్యామిలీ కోర్టులో పలుమార్లు కౌన్సిలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. కౌన్సిలింగ్ తరువాత కూడా సామ్, చై నిర్ణయంలో మార్పు రాకపోవడంతో విడాకులు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కానుందట. అయితే.., ఈ విడాకులకు గాను సమంతాకి మొత్తం 250 నుండి 300 కోట్ల రూపాయల వరకు భరణంగా అందబోతుందని సమాచారం. ఇందులో స్థిర, చర ఆస్తులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇది నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ కి కాస్త బాధ కలిగించే అంశమే. కానీ.., వారు విడిపోవడం మాత్రం ఖాయమని ప్రముఖ యూట్యూబర్ (మహీధర్ వైబ్స్) తాజాగా ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More news

Related News