సిస్టర్స్‏తో కలసి చరణ్ లంచ్ బ్రేక్.. నెట్టింట్లో వైరలవుతున్న ఫోటోస్..

8/29/2021
గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు.. రాఖీ పండుగ ఒకేరోజు రావడంతో చిరు ఇంట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకలకు పవన్, నాగబాబు, అల్లు అరవింద్ ఫ్యామిలీలు హాజరయ్యి ఘనంగా పండుగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‏కు మెగా సిస్టర్స్ రాఖీలు కట్టారు. అలాగే మరోవైపు సుష్మిత, శ్రీజ, నిహారిక సైతం రామ్ చరణ్, వరుణ్ తేజ్‏లకు రాఖీలు కట్టారు. అటు రెండు పండగలను చిరు ఫ్యామిలీ మొత్తం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేములో కనిపించడంతో అటు అభిమానులు కూడా ఖుషీ అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరోసారి మెగా సిస్టర్స్ అంతా ఒకే ఫ్రేములో కనిపించిన ఫోటోలు నెట్టింట్లో హల్‏చల్ చేస్తున్నాయి. సుష్మిత, శ్రీజ, నిహారికలను తీసుకుని రామ్ చరణ్ బయటకు వచ్చాడు. వీరందరూ కలసి ఈరోజు లంచ్ చేయడానికి బయటకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగా డాటర్ సుష్మిత, నిహారిక నెట్టింట్లో షేర్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం అద్భుతంగా గడిచింది అంటూ నిహారిక ట్వీట్ చేసింది. ముగ్గురు సిస్టర్స్‏తో కలిసి చరణ్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రదాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

More news

Related News