సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ని ఎలా పట్టుకున్నారంటే..

10/3/2021
ముంబయిలోని ఒక క్రూయిజ్ షిప్‌లో శనివారం (అక్టోబర్ 2వ తేదీ) అర్థరాత్రి జరిగిన పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు దాడి చేశారు. ఆ షిప్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారం తమకు అందిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఆ ఎనిమిది మందిలో ఉన్నట్లు ఎన్‌సీబీ ముంబయి డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు.

అర్యన్ ఖాన్‌తో పాటు అరెస్ట్ అయిన వారిలో అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచా, నూపూర్ సారిక, ఇస్మిత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నారని ఎన్‌సీబీ ప్రకటించింది.ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

అసలేం  ఏం జరిగింది?
ముంబయి నుంచి గోవా వెళుతున్న ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు ముంబయి డ్రగ్ కంట్రోల్ స్క్వాడ్‌కు సమాచారం అందింది. ఈ క్రూయిజ్ షిప్పు సోమవారం ముంబయికి తిరిగి రావలసి ఉంది.

ఎన్‌సీబీ అధికారులు పర్యటకులుగా ఓడలోకి ప్రవేశించారు. ఓడ ప్రయాణం ప్రారంభించగానే నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఆదివారం ఉదయం ఈ వార్తను మీడియాకు తెలియజేశారు.ఈ క్రూయిజ్ సర్వీస్ కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైందని, ఇందులో జరిగే పార్టీ టికెట్ ధర 80,000 రూపాయలు ఉంటుందని కొన్ని మీడియా రిపోర్టులు తెలిపాయి.

More news

Related News