విశాఖలో దారుణం... మంత్రి అవంతి కాన్వాయ్ ఢీకొని తాపీ మేస్త్రీ మృతి

11/10/2021
ఆంధ్ర ప్రదేశ్  టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్  లోని ఓ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు సీతమ్మదారలోని మంత్రి ఇంటిముందు ఆందోళనకు దిగారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...minister avanthi srinivas కాన్వాయ్ ఎయిర్ పోర్టు నుండి వస్తోంది. ఈ క్రమంలో ఈ వాహనశ్రేణిలోని కారు బిర్లా కూడలి వద్ద ఓ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న తాపీ మేస్త్రీ సూర్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. 

వేగంగా వెళుతున్న minister convoy లోని కారు ఢీకొట్టడంతో సూర్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే వెనకనుండి వచ్చిన మరోవాహనం అతడిపైనుండి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

తాపీ మేస్త్రీగా పనిచేసే సూర్యనారాయణ మృతితో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. కాబట్టి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ సీతమ్మధారలోని మంత్రి అవంతి నివాసం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో బాధిత కుటుంబం నిరసనకు దిగింది.

More news

Related News