లక్ష రూపాయల యంత్రం 20వేలకే.. కుమ్మరి, శాలివాహన కులవృత్తుల వృత్తుల వారికి సీఎం కేసీఆర్ శుభవార్త

9/12/2021
తెలంగాణలో కుమ్మరి, శాలివాహన కులవృత్తుల వారికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఆధునిక పాటరీ యంత్రాలపై ప్రభుత్వం అందించిన శిక్షణ పూర్తి చేసుకున్న 320 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక యంత్రాలను మంజూరు చేశారు. వారితోపాటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ప్రత్యేకంగా మండలానికి ఒకటి చొప్పున ఆధునిక కుండల బట్టీలను మంజూరు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం మంజూరు చేసిన ఆధునిక యంత్రాల ద్వారా మట్టి పాత్రలు, మట్టి నీళ్ల కూజాలు, వాటర్ బాటిళ్లు, టీకప్పులు, మట్టి విగ్రహాలు, మట్టి దీపపు కుండీలు ఇతరత్రా అలంకరణ సామాగ్రి అత్యంత వేగంగా వివిధ రకాల డిజైన్లతో చేసేందుకు వీలు ఉంటుంది. రూ.లక్ష విలువ గల ఆధునిక పాటరీ
యంత్రాలు రూ. 80వేల రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది.

More news

Related News