రాజ్‌కుంద్రాకు కటీఫ్ చెప్పేసిన శిల్పాశెట్టి?

8/30/2021
 నటి, రియాలిటీ షోస్ జడ్జి, ఫిట్నెస్ ట్రైనర్, పర్సనాలిటీ మోటివేటర్ శిల్పాశెట్టి ప్రస్తుతం భర్త నుండి విడిపోయేందుకు సిద్ధంగా ఉందన్నది బీటౌన్ సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్టు కావడంతో కొద్దిరోజులుగా ఇంటికే పరిమితమైన శిల్పా ఇప్పుడిప్పుడే బయటకి వస్తుంది. మళ్ళీ కెరీర్ లో బిజీగా మారేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు భర్త రాజ్ కుంద్రా జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండగా ఇప్పటికీ బెయిల్ దొరకలేదు. అయితే, ఇప్పటికే శిల్పా పిల్లలతో రాజ్ కుంద్రా ఇంటి నుండి బయటకి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

అస్లీల చిత్రాల కేసు నేప‌థ్యంలో భర్త రాజ్‌కుంద్రా మ‌నీని కూడా ముట్టుకోవ‌ద్ద‌ని శిల్పాశెట్టి భావిస్తున్న‌ట్లు సినీ వర్గాల్లో వినిపిస్తుండగా భ‌ర్త రాజ్‌కుంద్రాతో విడిపోయి త‌న పిల్ల‌ల‌తో క‌లిసి విడిగా బ్రతికేందుకు సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పిల్లలతో సహా రాజ్ కుంద్రా ఇంటి నుండి తన తల్లి వద్దకు వెళ్లినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. శిల్పాశెట్టి స్నేహితురాలు ఒకరి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. వారిద్ద‌రి మ‌ధ్య స‌మ‌స్య‌ల‌ను త‌క్కువ చేసి చూపాల్సిందేమీ లేద‌ని చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం బ‌య‌ట‌ప‌డటంతో శిల్పాశెట్టి షాక్‌కు గుర‌య్యార‌ని క‌థ‌నం ఉండగా.. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు, స్టేటస్ లు కూడా అది నిజమేనని నిరూపించాయి. భర్త అక్రమ మార్గంలో వ‌జ్రాలు, డ్యూప్లెక్స్ ఇండ్లు సంపాదించార‌న్న సంగ‌తి ఆమెకు ఇన్నాళ్లు తెలియకపోగా.. తెలిసిన తర్వాత ఇప్పుడు ఆమె అవి స్వీకరించేందుకు సిద్ధంగా లేదని చెప్పుకుంటున్నారు. మరోవైపు మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది.

More news

Related News