మళ్లీ అప్ఘానిస్తాన్ చేరుకున్న బిన్ లాడెన్ సన్నిహితుడు అమిన్ ఉల్ హక్

8/30/2021
అప్ఘానిస్తాన్ తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఉగ్రవాదులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సహా పలు దేశాల్లోని ఉగ్రవాదులు అప్ఘానిస్తాన్ కి తమ మకాం మారుస్తుండగా..తాజాగా అల్ ఖైదా ఉగ్రసంస్థకి చెందిన కీలక నేత అమిన్ ఉల్ హక్ అప్ఘానిస్తాన్ లోని తన సొంత ఊరుకి తిరిగి చేరుకున్నాడు.

అప్ఘానిస్తాన్ మ‌రోసారి తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ఈ అల్‌ఖైదా ఉగ్ర‌వాది మ‌ళ్లీ త‌న సొంత ప్రావిన్స్ అయిన నంగార్‌హ‌ర్‌కి వ‌చ్చాడు. అయితే అమిన్ ఉల్ హక్ ని వాహ‌నంలో రావ‌డం చూసిన అక్క‌డి తాలిబ‌న్ల‌లో కొంద‌రు.. సెల్ఫీలు దిగ‌డానికి ఎగ‌బ‌డడం విశేషం.

కాగా,అమిన్ ఉల్ హక్..2001లో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ ట‌వ‌ర్ల‌పై దాడిలో ప్ర‌ధాన సూత్ర‌ధారి మరియు 2011లో పాకిస్తాన్‌ లోని అబోటాబాద్‌ లో అమెరికా బ‌ల‌గాల చేతుల్లో హతమైన ఒసామా బిన్ లాడెన్ కి అత్యంత సన్నిహితుడు. తూర్పు అప్ఘానిస్తాన్ లోని టోరాబోరా ప్రాంతంలో బిన్ లాడెన్ తలదాచుకున్న సమయంలో అతనికి సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌గా అమిన్ ఉల్ హక్ ఉన్నారు. 1980ల్లో లాడెన్ కి చాలా దగ్గరివ్యక్తిగా మారిపోయాడు.

More news

Related News