భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీకి భారీ విజయం.

10/3/2021
భవానీపూర్ ఉప ఎన్నికలో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించిన మమత, తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.

కేవలం 57 శాతం ఓటింగ్ నమోదైనప్పటికీ, బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబరేవాల్‌పై 59 వేల ఓట్ల తేడాతో మమత విజయం సాధించారు. మరోవైపు గెలుపు అనంతరం మమతా కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘నందిగ్రామ్‌లో జరిగిన కుట్రకు భవానీపూర్ ప్రజలు సమాధానం ఇచ్చారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో విజయం అనంతరం కాళీఘాట్‌లోని తన నివాసం వెలుపల విలేకరులతో మమతా బెనర్జీ మాట్లాడారు. భవానీపూర్‌తోపాటు రాష్ట్ర ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే ఉప ఎన్నిక నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

‘‘రాష్ట్రంలోని ప్రజలంతా భవానీపూర్ ఫలితాల కోసం ఎదురుచూశారు. ఓటర్లు నాకు అండగా నిలిచారు. కుట్ర సిద్ధాంతాలను ఓడించి నాకు విజయం అందించారు’’అని మమత అన్నారు.

More news

Related News