పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరికి కదులుతున్న తమిళ హీరోలు..

11/5/2021
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అతని గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆయన ఎంత పెద్ద హీరో కాకపోతే వారం రోజుల తర్వాత కూడా ఆయన సమాధిని చూడటానికి అభిమానులు లక్షల్లో తరలి వస్తారు. అయితే ఈయన మరణించినప్పుడు తమిళ హీరోలపై సోషల్ మీడియాలో విమర్శలు ఉవ్వెత్తున ఎగిశాయి. అంత పెద్ద నటశిఖరం చనిపోతే చివరి చూపు చూడటానికి కూడా మీకు మనసు రాలేదా అంటూ నెటిజన్లు తమిళ హీరోలపై సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు.

అయితే పునీత్ చనిపోయిన 4 రోజుల తర్వాత తమిళ హీరోలు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన సమాధిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, నాగార్జున బెంగళూరు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతి ( vijay sethupathi ), శివ కార్తికేయన్ ( shiva karthikeyan ) లాంటి హీరోలు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జై భీమ్ ( Jai bhim ) సినిమాతో తాజాగా హిట్ కొట్టిన సూర్య ( suriya ) కూడా పునీత్ స‌మాధి ద‌గ్గ‌రికి వెళ్లి నివాళుల‌ర్పించాడు. పునీత్ లేడ‌నే విష‌యం గుర్తుకు వ‌చ్చి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. మరోవైపు కంఠీరవ స్టేడియంలో ఖననం చేసిన పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకోవడానికి రోజుకు లక్షల్లో అభిమానులు అక్కడికి వస్తున్నారు. అధికారికంగా పునీత్ సమాధిని సందర్శించేందుకు అభిమానులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు శివన్న. దాంతో ఆయన అభిమానులు కంఠీరవ స్టేడియంలో బారులు తీరుతున్నారు.

ఇప్పటికే 5 లక్షల మంది అభిమానులు పునీత్ రాజ్‌కుమార్‌ ( Puneeth rajkumar ) సమాధిని చూసేందుకు వచ్చారని ఓ అంచనా. మొన్న ఆయన అంత్యక్రియలకు దాదాపు 11 లక్షల మంది హాజరయ్యారు. ఇదంతా చూస్తుంటే కర్ణాటక ప్రజలు పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పట్లో మర్చిపోయేలా కనిపించడం లేదు. ఒక మనిషిపై ఇంత అభిమానం ఎలా చూపిస్తారు.. అంతగా చూపిస్తున్నారు అంటే ఆయన ఎంత గొప్పవాడు అంటూ నాన్ కన్నడ ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.

More news

Related News