డ్రగ్స్‌ కేసులో షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి

10/3/2021
ముంబై డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు NCB అధికారులు. ఉదయం నుంచి విచారిస్తున్న అధికారులు డ్రగ్స్‌ కేసులో ఆధారాలు లభించడంతో ఆర్యన్‌ను అరెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఉన్న ఆర్యన్‌ను పోలీసులు స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత జడ్జిముందు హాజరు పర్చారు. ముంబై డ్రగ్స్‌ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నుంచి వస్తున్న సమాచారంతో కొత్త కొత్త ఏరియాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటి వరకు డ్రగ్స్‌ అంటే.. పంజాబ్‌, ఢిల్లీలకు లింక్స్‌ ఉండేవి. అక్కడ డ్రగ్స్‌ తయారీపై నిఘా పెరగంతో.. అక్కడి తయారీ దారులు సేఫ్‌ ప్లేస్‌ను మకాం మార్చారు.  తీగలాగితే డొంక కదిలినట్టు.. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు హైదరాబాద్‌తో లింక్స్‌ దొరికాయి. హైదరాబాద్‌ టు ముంబైకి సప్లైయ్‌ అవుతోంది. ఎంతలా అంటే.. మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌ బ్రాండ్‌ ముంబైలో మారు మోగుతోంది. హైదరాబాద్‌ పారిశ్రామిక వాడల్లోని కెమికల్‌ ఫ్యాక్టరీల్లో తయారైనట్టు గుర్తించారు. లోకల్‌ ఇండస్ట్రీస్‌లో తయారైన మత్తును ముంబైక్‌ షిఫ్ట్‌ చేసి.. అక్కడి నుంచి షిప్‌ల ద్వారా ఆస్ర్టేలియాకు ఎగుమతి చేస్తున్నట్ట NCB టీమ్స్‌ ఇన్వేస్టిగేషన్‌లో తేలింది. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోంది. ఎంతలా.. అంటే.. ల్యాబ్‌లో పని చేసే ఎంప్లాయిస్‌కు కూడా తెలియనంత స్థాయిలో జరుగుతోంది. డ్రగ్స్‌లో కీలకమై ఎఫిడ్రిన్‌ తయారీ కేంద్రం కూడా హైదరాబాద్‌లోనే ఉన్నట్టు విచారణలో తేలింది.

ముంబైలోని అంథేరిలో 5 కోట్ల విలువలైన ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్న NCB అధికారులు.. మైండ్‌ బ్లాక్‌ అయ్యే నిజాలు బయట పడ్డాయి. ముంబై నుంచి  ఆస్ట్రేలియాకు ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్న మత్తు మందంతా హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల ముడి సరుకును హైదరాబాద్‌కు దిగుమతి చేసుకొని ఎఫిడ్రిన్‌గా మార్చి ఈ చీకటి దందాను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో 50వేల విలువ చేసే ఎఫిడ్రన్‌ ఆస్ట్రేలియాలో 5 లక్షలు పలుకుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందిని అరెస్ట్‌ చేసింది NCB. గతంలో కూడా ఓ కేసులో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తయారు అవుతున్నట్టు తేలింది. కెమికల్‌ ల్యాబ్‌ పేరుతో వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు సమాచారం అందింది. పోలీసులు జరిపిన దాడుల్లో డ్రగ్స్‌ పన్నాగం బయట పడింది. ల్యాబ్‌లో ఉన్న ఏర్పాట్లను చూసి పోలీసుల దిమ్మతిరిగియింది. కెమిస్ట్రి సైన్టిస్ట్ గా పని చేస్తున్న ఆ వ్యక్తి ఎక్కువ డబ్బులకు ఆశ పడి.. ఈ పన్నాగం ఆడాడు. ఎట్టకేలకు పోలీసుల దాడులతో దొరికి పోయాడు.. ఇప్పుడు కూడా సేమ్‌ టు సేమ్‌ నడిచినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో తయారైన డ్రగ్స్‌ని ముంబైకి తరలించి.. అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు.

More news

Related News