ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ పేరెత్తకుండా, ఆ దేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమని వార్నింగ్ ఇచ్చారు?

9/25/2021
‘తీవ్రవాదాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్న వారు ఒక విషయాన్ని గుర్తించాలి. అదేంటంటే.. తీవ్రవాదం వాళ్లకు కూడా అంతే ప్రమాదకరం. అఫ్గానిస్తాన్ భూభాగాన్ని తీవ్రవాద దాడుల కోసం కానీ, తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు గానీ ఉపయోగించుకోకుండా చూడాలి.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న సున్నితమైన పరిస్థితులను కొన్ని దేశాలు తమ స్వార్థం కోసం, ఒక అస్త్రంగా వాడుకోకుండా చూడాలి.

అఫ్గానిస్తాన్ ప్రజలు, మహిళలు, చిన్నారులు, మైనార్టీలకు సహాయం అవసరం. ఈ మేరకు మనమంతా ముందుకురావాలి, సహాయం అందించాలి.’’

"ప్రపంచమంతా గత 100 సంవత్సరాలలో ఎన్నడూ చూడని మహమ్మారిని గత సంవత్సరంన్నర కాలంగా ఎదుర్కొంటోంది. కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నేను నివాళి సమర్పిస్తున్నాను. మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియచేస్తున్నాను" అని ప్రధాని అన్నారు.

మోదీ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు:

"ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా పిలిచే దేశానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆగస్టు 15న భారతదేశం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. మా దేశంలో నెలకొన్న భిన్నత్వం, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మా దేశ ప్రత్యేకతలు. దేశంలో అనేక భాషలు, వందలాది మాండలికాలు, విభిన్నమైన జీవన శైలులు, వంటకాలు ఉన్నాయి. వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యానికి భారతదేశం ఒక ఉత్తమమైన ఉదాహరణగా నిలుస్తుంది".

"గుజరాత్ కు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేశాను. భారతదేశానికి గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రిగా ఉన్నాను. నేను 20 సంవత్సరాలుగా దేశ ప్రజలకు సేవ చేస్తున్నాను. ప్రజాస్వామ్యం పని చేస్తుంది, పని చేసింది అని నా స్వానుభవం ద్వారా చెప్పగలను".

More news

Related News