ఈ డ్రై‌ఫ్రూట్స్‌ను నానబెట్టి తింటే డయాబెటిక్స్‌కు చెక్ పెట్టొచ్చు.. మరెన్నో సూపర్ బెనిఫిట్స్

10/12/2021
రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు ప్రతీ ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఇక బాదాం, పిస్తా, కాజు వంటి డ్రై ఫ్రూట్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఎన్నో పోషకాలు కలిగి ఉండే డ్రై ఫ్రూట్ వాల్‌నట్స్. ఆక్రూట్స్ అని పిలవబడే ఈ వాల్‌నట్స్.. శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, మినరల్స్‌ను ఇస్తాయి. అలాగే నిరోధక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచుతుంది. అటు చెడు కొవ్వును కరిగించడమే కాకుండా.. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది సూపర్ ఫుడ్స్ క్యాటగిరీలో ఉంటుంది. ఇదిలా ఉంటే నానబెట్టిన వాల్‌నట్స్ తినడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చునని ఓ అధ్యయనంలో తేలింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నానబెట్టిన వాల్‌నట్స్ తినడం ఓ మంచి అలవాటు. విత్తనాలు, గింజలు అనేక ఎంజైమ్‌లను కలిగి ఉంటాయి. వాటిని జీర్ణించుకోవడం చాలా కష్టం. కాబట్టి వాల్‌నట్స్‌ను నానబెట్టడం ద్వారా అవి సులభంగా జీర్ణమవుతాయి. వాల్‌నట్స్‌ను నానబెట్టడం వల్ల అందులోని పోషక విలువలు ఏమాత్రం తగ్గవని తేలింది.

రోజూ నానబెట్టిన వాల్‌నట్స్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లోకి తీసుకురావచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. వాల్‌నట్స్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కర స్థాయిని తగ్గించడమే కాకుండా శరీరం నుంచి బ్లడ్ షుగర్‌ను విడుదల చేస్తుంది. నానబెట్టిన వాల్‌నట్స్ గ్లైసెమిక్ సూచిక కేవలం 15 మాత్రమే. తద్వారా దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు మధ్యాహ్న వేళ ఆరోగ్యకరమైన స్నాక్‌గా తీసుకోవచ్చు.

మరోవైపు వాల్‌నట్స్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్‌నట్‌లను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది కాకుండా వాల్నట్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి. రోజూ నానబెట్టిన వాల్‌నట్ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

More news

Related News