Loading. Please wait.

actress,actors gallery

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం Flesh Eating Bacteria .!

9/15/2020
 కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. అక్కడ ఇప్పటివరకు 6,749,289 పాజిటివ్ కేసులు బయటపడగా.. 199,000 మంది వైరస్ కారణంగా చనిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్‌లో ఓ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ విజృంభిస్తోందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. అదే మాంసాన్ని సంగ్రహించే విచిత్రమైన బ్యాక్టీరియా.. దాన్ని ‘విబ్రియో వల్నిఫిక్స్’గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని కనెక్టికట్‌లో ఐదుగురికి ఈ వ్యాధి సోకడంతో.. అక్కడ ఉన్న ప్రజలకు వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.

మాంసాన్ని ఆహారంగా తినే ఈ విచిత్రమైన బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణను ‘విబ్రియో వల్నిఫిక్స్’ అని అంటారు. రాష్ట్రంలోని ఐదుగురికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయింది. సంక్రమణ సోకినవారికి ఇంటెన్సివ్ కేర్ అత్యవసరం.. లేదంటే బ్యాక్టీరియా శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ విబ్రియో బ్యాక్టీరియా లాంగ్ ఐలాండ్‌లోని ఉప్పు లేదా ఉప్పునీటి కయ్యల నుంచి వ్యాపిస్తుందని.. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని” డాక్టర్ మాథ్యూ కార్టర్ పేర్కొన్నారు.

Related news

More News

-Next--Last